తెలుగు రాష్ట్రాలలో వరద బాధిత కుటుంబాలకు దాదాపు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం – శరత్ చౌదరి, రోటరీ గవర్నర్

తెలంగాణా లో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలలో, ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ కు దిగువ తీరాన తెనాలి – రేపల్లె ఏరియా లో వున్న కొన్ని గ్రామాలలో పూరిగా నిరాశ్రయులు అయిన కుటుంబాల సహాయార్ధం రోటరీ క్లబ్ లు ముందుకు వచ్చాయని రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి తెలిపారు.
శ్రీ శరత్ చౌదరి మాట్లాడుతూ వరద ప్రమాదం మొదలయిన వెంటనే గత 5 రోజులుగా ఖమ్మం, భద్రాచలం, గుంటూరు, తెనాలి, రేపల్లె రోటరీ క్లబ్ వారు అనేక సహాయ కార్యక్రమాలు చేసేస్తున్నారని, ఫుడ్ పాకెట్స్, మెడిసిన్ లు పంచుతున్నారని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, గుంటూరు – ప్రకాశం జిల్లాల్లోని రోటరీ క్లబ్ లు అన్ని కలిసి ఆత్మబంధువు అనే ప్రాజెక్ట్ పేరున దాదాపు 50 లక్షల రూపాయల విలువైన వంట సామాను కిట్స్ ని తయారు చేసి దాదాపు 2500 మంది ఖమ్మం జిల్లాలలోని గ్రామాలలో, 1500 మంది తెనాలి-రేపల్లె ఏరియా లోని గ్రామాలలో వరద భాదితులకు అందచేస్తున్నామని తెలిపారు. గత 3 రోజులుగా ఖమ్మం రోటరీ క్లబ్ వారు మల్లాది వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ప్యాకెట్ లో 5 Kg రైస్, 1 Kg బొంబాయి రవ్వ, 1 Lt వంట నూనె, 1/2 Kg చింతపండు, కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, ఇతర దినుసులు వుంటాయని, ఒక కుటుంబానికి ఒక వారం రోజులు సరిపోయేలా ఏర్పాటు చేశామని చెప్పారు.
అదే విధం గా పిడుగురాళ్ల రోటరీ క్లబ్ వారు Dr విష్ణు బాబు ఆద్వర్యం లో ఆంధ్ర ప్రాతం లో పంచటానికి 2500 కుటుంబాలకు వంట సామాను పాకెట్స్ ని రెడీ చేస్తున్నారని తెలిపారు.
శ్రీ శరత్ చౌదరి మాట్లాడుతూ అన్ని చోట్ల కూడా రోటరియన్స్ ఎంతో శ్రమ పడి వరద బాధిత కుటుంబాలని గుర్తించి రోటరీ సహాయం నేరుగా వారికి అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని.శుక్రవారం, సెప్టెంబర్ వ తేదీన ఖమ్మం లో, ఆదివారం 8 వ తేదీన రేపల్లె ఏరియా గ్రామాలలో ఈ వంట సామాను కిట్ ల పంపిణి ప్రారంభం అవుతుందని తెలిపారు. వెంటనే స్పందించి ధన సహాయం, వస్తు సహాయం చేస్తున్న రోటరియన్స్ అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు
పంపిణీ గురించి మరిన్ని వివరాలకు
PDG Malladi Vasudev, Khammam – +91 94401 60166
Rtn Dr Vishnu Babu, Piduguralla – +91 94404 54611