శ్రీవారి భక్తులకు శుభవార్త….

తిరుమలలో గదుల కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరింత సరళీకృతం చేసింది. తిరుమలలోని 6 ప్రదేశాల్లో గదుల కేటాయింపునకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. జీఎన్‍సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, రామ్ భగీచ, ఎంబీసీ, సీఆర్‍వో వద్ద రిజిస్టేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. గదుల కోసం పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‍ఎంఎస్ పంపనున్నారు. ఎస్‍ఎంఎస్ వచ్చిన తర్వాత భక్తులు నగదు చెల్లించి గదిని పొందేలా ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి నూతన విధానం అమలులోకి రానుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు గదులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు టీటీడీ తీసుకున్న నిర్ణయంతో భక్తులకు కాస్త ఉపశమనం లభించనుంది.