నగిరి లో మూడోసారి నగారా మోగిస్తా..ఆర్కే రోజా..
వైసీపీ లో ఎక్కువ కాంట్రవర్సీలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నేత నగిరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి.. ఆర్కే రోజా. ఈసారి ఎన్నికల్లో కూడా నగిరి టికెట్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఈమె కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయినట్లు కనిపిస్తోంది. ఈసారి కూడా నగిరిలో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని సవాళ్లు చేస్తోంది. రోజాకు నగిరి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆమెను ఓడిస్తామని స్థానిక వైసిపి నేతలే ఓ రేంజ్ లో వార్నింగులు ఇచ్చారు. మొదటినుంచి ఏ పార్టీలో ఉన్న.. రోజాకు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. సర్వే లెక్కల ప్రకారం కూడా ఈసారి రోజా గెలవడం కచ్చితంగా కుదరదని క్లియర్గా అర్థం అవుతుంది.అసమ్మతి వర్గం కలిసి రాకపోయినా ఆమె భర్త సెల్వమణి, కుటుంబ సభ్యులు తెరవెనక వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. ప్రస్తుతం సినీ గ్లామర్ పెద్దగా లేకపోయినా నగిరి లో సామాజిక వర్గ సమీకరణ మాత్రం రోజాకి కాస్త అడ్వాంటేజ్ గానే కనిపిస్తుంది. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత గట్టిగా ఉన్నప్పటికీ.. మ్యాజిక్ జరిపించైనా హ్యాట్రిక్ సాధిస్తాను అని ధీమా వ్యక్తం చేస్తోంది రోజా. అయితే ఆమె కాన్ఫిడెన్స్ గెలుస్తుందా లేదా అన్న విషయం రిజల్ట్స్ వస్తేనే తెలుస్తుంది.













