చంద్రబాబును నమ్ముకుంటే అంతా గోవిందా..రోజా
నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేశారు. దీనిపై స్పందించిన మంత్రి రోజా సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు కురిపించారు. మరి ముఖ్యంగా మ్యానిఫెస్టోలో విద్యారంగం కోసం పేర్కొన్న అంశాల గురించి ఆమె ప్రస్తావించారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీ కు ఓటు వేస్తే ప్రజల పరిస్థితి అంతే అని విమర్శించారు. పొరపాటున చంద్రబాబును ఎన్నుకుంటే.. ఇక ఇంగ్లీషు విద్య ఉండదు.. నాడు- నేడు పాఠశాల అభివృద్ధి జరగదు..ఐబీ సిలబస్ ఉండదు.. పిల్లలకు పౌష్టికాహారం అందించే గోరుముద్ద కూడా ఉండదు అని విమర్శించారు. ఇప్పుడు పిల్లలకు అందుతున్న విద్యా కానుక, ఎనిమిదవ తరగతి పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానం పెంచడానికి అందుబాటులోకి తెస్తున్న ట్యాబులు, బైలింగ్యువల్ బుక్స్ లాంటి వసతులు ఏవి ఉండవని ఆమె పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న ఎంతో ఆలోచించి ఏర్పాటు చేసిన ఈ వసతులు అన్ని రేపు భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కచ్చితంగా ప్రజలు జగన్ కు ఓటు వేసి గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.













