మంత్రి రోజా సంచలన నిర్ణయం.. ఇకపై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొత్త మంత్రులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రోజా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెను ఆశీర్వదించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి టీవీ షోలు బంద్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే జబర్దస్త్ షోలకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. రోజా గత పదేళ్లుగా జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానని రోజా ప్రకటించారు.













