ఐటీలో ఏపీయే మార్గదర్శకం : గోవా ఐటీ మంత్రి
గోవా కూడా భారతదేశ ఐటీ ముఖచిత్రంలో ప్రధాన భూమికను చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, దానికి ఆంధ్రప్రదేశ్ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిచాలని గోవా ఐటీ శాఖ మంత్రి రోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, తన పాలనలో ఐటీ చోటుచేసుకున్న సరికొత్త ఆవిష్కరణలను గోవా ఐటీ శాఖ మంత్రి రోహన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఏపీ ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, స్టార్ట్ ఆఫ్ పాలసీ, డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీలను సమగ్రంగా పరిశీలించామని గోవా మంత్రి ముఖ్యమంత్రికి వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, కోర్ డ్యాష్ బోర్డ్, ఇ ప్రగతి, ఏపీ ఫైబర్ గ్రిడ్, మీ ఇంటికి మీ భూమి తదితర అంశాల గురించి ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నా గోవా మంత్రి దేశం గర్వించే స్థాయిలో ఏపీ ఆవిష్కరణలున్నాయని కొనియడారు.
ప్రజా సమస్యల పరిష్కారం, వ్యవసాయాభివృద్ధి కోసం వినియోగిస్తూన్న టెక్నాలజీ వినియోగం చూస్తుంటే తాము ఇప్పడే పట్టినట్లు అనిపిస్తోందని రోహన్ అన్నారు. ఎప్పడూ 15, 20 ఏళ్ళ ముందుగా ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శనం తమ రాష్ట్ర దీర్ఘకాల అభివృద్ధికి ఎంతో ఉపయుక్తం అవుతుందని విస్వశిస్తున్నామని, విస్తీర్ణంపరంగా చిన్న రాష్ట్ర మైన గోవాలో ఐటీ అభివృద్ధి ప్రభుత్వ శాఖల్లో ఐటీ వినియోగంలో సహకరించాలని రోహన్ కోరగా, సహకారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.













