Robot : సీఎం చంద్రబాబుకు రోబో స్వాగతం

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు రోబో (Robot) స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే టెకీ బాట్ రోబో రెండు కాళ్లపై నిలుచుని నమస్కారం చేసింది. దీంతో చంద్రబాబు నవ్వులు చిందిస్తూ యా యా గుడ్ గుడ్ వెరీ గుడ్ అంటూ ప్రతి నమస్కారం చేశారు. సీఎం ఆసక్తిగా గమనించడంతో తయారీ సంస్థ రెండోసారి నమస్కారం చేయించింది. రోబోకు ఇచ్చే సూచనల ఆధారంగా డ్యాన్స్ కూడా చేస్తుందని తెలిపింది. పక్కనే ఉన్న టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ (Chandrasekaran)కు, ఓర్వకల్‌లో డ్రోన్ సిటీ (Drone City) ఏర్పాటు ప్రతిపాదన గురించి సీఎం వివరించారు.