ముఖ్యమంత్రిని కలిసి వినతి అందించిన ఆర్ ఎంపి సంఘ ప్రతినిధులు
ఆర్ ఎంపిలకు చంద్రన్న బీమా,ఎన్టీఆర్ వైద్యసేవ వర్తింపచేయాలి
ముఖ్యమంత్రిని కలిసి వినతి అందించిన ఆర్ ఎంపి సంఘ ప్రతినిధులు
ఆర్ ఎంపిలకు వెంటనే శిక్షణ కార్యక్రమం ప్రారంభించాలని,465జివోను అమలు చేయాలని ఆర్ ఎంపి సంఘాల ప్రతినిధులు కోరారు.గురువారం ప్రజావేదికలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు.
గ్రామాల్లో నిరుపేదలకు వైద్యసేవలు అందిస్తున్న ఆర్ ఎంపిల సేవలను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని, చంద్రన్న బీమా పథకం,ఎన్టీఆర్ వైద్యసేవ,ఎన్టీఆర్ గృహ వసతి,వృద్దాప్య పించన్లు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆర్ ఎంపిలకు వర్తింప చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ పీరియన్స్ డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అసోసియేషన్ ప్రతినిధులు కంబాల బాబూరావు,అచ్చిరెడ్డి,రాజా సిద్దార్ద,కిషోర్ కుమార్,ఉమా శంకర్,ఆదిరెడ్డి,జనార్దన్,నాంచారయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.













