ప్రత్యేక హోదాపై చిరంజీవి.. అప్పుడెందుకు అడగలేదు : మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చిరంజీవి ఎందుకు అడగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా చిరంజీవిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని రోజా హితవు పలికారు. చిరంజీవి సలహా ఇవ్వాలి అనుకుంటే ముందు ఆయన తమ్ముడికి ఇవ్వాలని సూచించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీ విలీనం చేసినప్పుడు చిరంజీవి లబ్ది పొందారని, కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. సినిమా వాళ్లు చెప్తే వినే స్థాయిలో లేమన్నారు. గడపగడపకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎన్ని రోడ్లు వేశామోనని పేర్కొన్నారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారని ప్రశ్నించారు. హీరోలందరూ సీఎం జగన్ దగ్గరకు ఎందుకెళ్లారని నిలదీశారు. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని అన్నారు. రాష్ట్రం విడిపోతే చిరంజీవి ఏం చేశారని ప్రశ్నించారు.













