ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి ఆదేశాలతో 45 ఏళ్లు నిండిన వారికి తొలి డోస్ వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభమైంది. ఈ టీకా స్పెషల్ డ్రైవ్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. జర్నలిస్టులకు కూడా తొలి డోస్ వ్యాక్సిన్ ఇవ్వనుంది. రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.