అక్కడ లోకేష్.. ఇక్కడ ఆర్జీవి.. మధ్యలో జగన్ గ్రాఫిక్స్..
జగన్ నిర్వహిస్తున్న “సిద్ధం” సభల్లో జనాలు వైసిపి వర్గాలు చెప్పినంత రేంజ్ లో రాలేదని.. జనాలు లేక గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ చేశారని లోకేష్ ఆరోపించారు. దీనికి సాక్షాలుగా ఒకే ఫోటోలో ఒకే విధమైన గుంపులు గా ఉన్న జనాలను మార్క్ చేసి మరి నెట్టింట వైరల్ చేశారు. దీంతో లోకేష్ పై వైసీపీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. వీళ్లు చాలరు అన్నట్లు ఇప్పుడు ఆర్జీవి కూడా ఈ విషయం పై స్పందించారు. లోకేష్ ది అవధులు లేని అజ్ఞానం అంటూ రాంగోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా మీకు శనిమారంగంలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా .లైవ్ ప్రసారం జరిగేటప్పుడు ఇలా గ్రీన్ మ్యాట్లు వేసి లేని జనాన్ని సృష్టించి గ్రాఫిక్ చేయడం కుదురుతుందేమో వాళ్ళని అడగండి అంటూ రాంగోపాల్ వర్మ సవాల్ విసిరాడు. విమర్శించే ముందు అసలు ఆ విషయాన్ని కనుక్కుంటే మంచిది అంటూ లోకేష్ పై చురకలు వేశాడు. ఇక ఈ విషయంపై టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Ur ignorance has no limits .. Since u have lot of friends in the film industry , couldn’t u have asked them how anyone can do graphics in a live streaming event? https://t.co/elzkHDKtB9
— Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2024













