Nara Lokesh: ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నారా లోకేష్ ఆధ్వర్యంలో సమీక్ష

నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రెండో రోజు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలో సమీక్ష. సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఇప్పటికే ఖాట్మండూ చేరుకున్న ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానం. ఖాట్మండూ నుంచి ఏపీ వాసులతో మధ్యాహ్నం 3 గం.లకు విశాఖ, అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రత్యేక విమానం. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులను స్వాగతించాలని ఆదేశించిన మంత్రి లోకేష్. విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న ఏపీ వాసులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించిన మంత్రి లోకేష్. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించిన మంత్రి లోకేష్.