విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ… హైకోర్టులో వ్యాజ్యం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్లో కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నేతలతో లక్ష్మీ నారాయణ సమాలోచనలు జరుపుతున్న విషయం తెలిసిందే.













