Seaplane: రాష్ట్రంలో సీప్లేన్ సేవలు : మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 32 ప్రాంతాల నుంచి సీప్లేన్ (Seaplane) సేవలు అందించేందుకు ఢల్లీికి చెందిన మెహెయిర్ (Mehair) సంస్థ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి (BC Janardhan Reddy) ని సచివాలయంలో కలిసి ప్రతిపాదనలు అందించారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సంస్థ పూర్తి స్థాయి ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తాం. సీప్లేన్ సర్వీసులతో పర్యాటకరంగం (Tourism) అభివృద్ధి చెందుతుంది. మారుమూల ప్రాంతాలతో అనుసంధానమూ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు వస్తాయి అని పేర్కొన్నారు.