రాజధానిని మార్పు చేసే అధికారం.. రాష్ట్రానికి ఉందా? లేదా?
మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జనవరి 28కి వాయిదా వేసింది. రాజధానిని మార్పు చేసే అధికారం రాష్ట్రానికి ఉందో లేదో తేల్చాలని అమరావతి రైతుల తరపున న్యాయవాదులు కోరారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉప సంహరణ బిలుల్లకు గవర్నరు ఆమోదం చెప్పినప్పటికీ తమ పిటిషన్లలోని అభ్యర్థనలు మనుగడలోనే ఉన్నాయన్ని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆయా వ్యాజ్యాల్లోని అభ్యర్థనలు ఏ మేరకు మనుగడలో ఉన్నాయని భావిస్తున్నారో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉండవని చెబుతున్నారో తెలియజేస్తూ పిటిషనర్లు మెమో దాఖలు చేయాలని ఆదేశించింది. పది రోజుల్లో మెమో దాఖలు చేస్తే ఆ తర్వాత ప్రభుత్వ స్పందన కూడా చెప్పాలంది. అమరావతిలో అభివృద్ధి పనులు చేసేందుకు అడ్డంకి కాబోవన్న ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు త్రిసభ్య ధర్మాసనం సోమవారం పోడిగించింది.













