కూటమికి బోట్ల చిక్కు.. రంగంలోకి దిగిన నేవీ..
విజయవాడలో వరదలు ముంచెత్తిన సమయంలో ప్రకాశం బ్యారేజీని ఐరన్ బోట్లు బలంగా ఢీ కొట్టిన వ్యవహారం ఎంత కలకలం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఈనెల ఒకటి రెండు తారీకుల్లో కృష్ణా నది ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద భారీగా 11 లక్షలక్యూసెక్కులకు పైగా నీటిని బ్యారేజీ లోకి తీసుకువచ్చింది. అదే సమయంలో ఐరన్ బొట్లు బారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. అనంతరం వీటి వెనుక కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి అన్న అనుమానాలు కూడా కలగడంతో దర్యాప్తు చేపట్టారు.
ఇక ఈ నాలుగు ఐరన్ ఓట్ల విషయానికి వస్తే అవి ఇంకా ప్రకాశం బ్యారేజీ లోనే ఉన్నాయి. వీటి కారణంగా 67-69 గేట్ల మధ్య ఉన్న సపోర్టు తీవ్రంగా దెబ్బతినింది. వెంటనే అక్కడ మరమ్మతులు చేసి కొత్త సపోర్టును వేశారు. అయితే బూట్లు మాత్రం ఇంకా బ్యారేజీ లోనే ఇరుక్కొని పోవడం చంద్రబాబు సర్కార్ కి పెద్ద తలనొప్పిగా మారింది. చేత్తో తీసి పక్కన పెట్టడానికి అవి పేపర్ బోట్లు కాదు.. కొన్ని క్రేన్ సహాయంతో తీద్దామా అంటే అది కుదిరేలా కనిపించడం లేదు.
ఐరన్ బొట్లు బలంగా ఉండడం.. భారీ క్రేన్లు ఉపయోగించిన బయటకు తీయలేకపోవడం తో అధికారులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఈ బోట్లు ఇరుక్కుపోవడంతో ప్రవాహానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక చేసేది లేక బోట్లను ఉన్న ప్రదేశంలోనే ముక్కలుగా విడగొట్టి ఒక్కొక్క ముక్కను బయటకు తీసుకురావడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ పని కూడా అనుకున్నంత సులువుగా సాధ్యపడేలా కనిపించడం లేదు. అనుభవం ఉన్న డైవర్స్ చేత ఈ పని చేయించడానికి చూసినప్పటికీ కుదరలేదు. దీంతో ఏకంగా నేవీని రంగంలోకి దింపాల్సి వచ్చింది. రాబోయే రెండు రోజుల్లో త్వరితగతిన ఈ పనిని పూర్తి చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకే పదిమందితో కూడిన డైవింగ్ టీం నదిలోకి దిగి బోట్లను కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే లోతు ఎక్కువ ఉండడం, నది గర్భం కావడంతో ప్రమాదం తీవ్రంగా ఉంది.
వెయిట్ టన్నులకు పైగా బరువు ఉన్న ఒక్కొక్క బోటును ముక్కలు చేయడం అంటే ఆషామాషీ పని కాదు. ఒక్కొక్క బోటు ఖరీదు కోటిన్నర పైన ఉంటుందని అంచనా. అయితే ఈ బోట్లను తీయడానికి సుమారు మూడు కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఖర్చు సర్కార్ కి అదనపు భారమేనంటున్నారు మంత్రులు. బోటు బ్యారేజీని ఢీ కొట్టి కలిగించిన నష్టం కంటే బోట్లను బయటకు తీయడానికి అవుతున్న ఖర్జూ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో బోట్లు కూటమి సర్కార్ కి పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి అని అందరూ భావిస్తున్నారు.













