ఇది తెలుగువారికి దక్కిన గౌరవం
భారతదేశానికి జాతీయపతాకాన్ని అందించిన గౌరవం తెలుగువారికి దక్కించిన మహనీయుడు పింగళి వెంకయ్య అని తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వందేమాతరం, హోమ్రూల్ వంటి ఉద్యమాల్లో పింగళి పోరాట స్ఫూర్తి మనందరికీ అదర్శనీయమన్నారు. జాతీయపతాక రూపకర్త, స్వాతంత్య్ర పోరాట యోధుడైన పింగళి వెంకయ్య.. వ్యవసాయ, భూగర్భ శాస్త్ర పరిశోధనలలో సైతం ఎంతో కృషి చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా దేశానికి సేవలందించారన్నారు. ఆ మహనీయుని దేశసేవను స్మరించుకుందామని అన్నారు.













