చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట .. ఒకేసారి మూడు కేసుల్లో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపారు. పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీసు ఇచ్చాకే విచారించాలని సీఐడీని ఆదేశించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది.













