అప్పు చేసైనా అభివృద్ధి, సంక్షేమం : వైఎస్ జగన్
ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని, అందుకే అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతున్నామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, టైక్స్‌టైల్ పరిశ్రమలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రూ.1,124 కోట్ల ప్రోత్సహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామని అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నామన్నారు. పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వకపోతే అవి రోడ్డున పడే పరిస్థితి ఉందని అన్నారు. ఎంఎస్ఎంఈలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. 25 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు అని అన్నారు.













