ఏపీలో రెడ్‌జోన్ మండలాలు 97
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నమోదైన కరోనా పాజిటివ్ కేసులు నమోదును అనుసరించి రెడ్‌జోన్ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకొని రెడ్జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెడ్జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్ జోన్ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు పాజిటివ్ కేసు ఒక్కటీ నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్‌జోన్ పరధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు. కేసులు నమోదైతే గ్రీన్‌జోన్ మండలం రెడ్‌జోన్‌లోకి వెళ్తుంది. ఈ నెల 20 నుంచి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను జిల్లాల్లో అమలుచేయలని కలెక్టర్లను కోరింది.













