మెగా బ్రదర్ నాగబాబు మౌనవ్రతం..అసలు రీజన్ ఏమిటో?
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కంటే కూడా మొదటి నుంచి ఎక్కువ హడావిడి చేస్తూ వచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు. అనకాపల్లి నుంచి నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అనగానే అందరూ ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. దీనికి తగినట్టు డైరెక్ట్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకొని అక్కడ నుంచి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో నాగబాబు రివ్యూలు జరిపారు. ఈ హడావిడి చూసి నాగబాబు ఎంపీగా గెలవడం ఖాయం.. కేంద్రంలో మంత్రి అవ్వడం ఖాయం అని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. అయితే సడన్గా నాగబాబు పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఆ షాక్ తో మెగా బ్రదర్ మౌనవ్రతంలోకి వెళ్ళిపోయాడు. బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన మూడు ఎంపీ సీట్లలో కూడా ఒకటి వెనక్కి తీసుకున్నారు. పోనీ కనీసం అసెంబ్లీ టికెట్ అయినా అడ్జస్ట్ చేస్తారా అంటే ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. చంద్రబాబు ఇచ్చిందే అరాకొరా సీట్లు..ఇప్పుడు బీజేపీ కి వాటా పంచితే మిగిలేవి ఎన్నో తెలియదు. ఇక అన్ని లెక్కలు చూసుకుని లాస్ట్ లో విడుదల చేసే టైంకి లిస్టులో నాగబాబు పేరు ఉంటే ఉండొచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. ఇక అప్పుడైనా నాగబాబు మౌనం వీడుతాడేమో చూడాలి.













