రాళ్ళ దాడి బాబుకే ఇబ్బంది అయిందా…?
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు కొన్ని కొన్ని మాటలు మాట్లాడే విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కాస్త ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. కొన్ని కొన్ని అంశాల్లో ఆయన ఎక్కువగా మాట్లాడుతూ అప్పుడు ప్రతిపక్ష పార్టీని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఇక అధికార పార్టీ విషయంలో ప్రతిపక్షాలు ఎంత సీరియస్గా ముందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తే ఆ తర్వాత అన్ని అంశాల్లో కూడా ప్రతిపక్షాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అయితే చంద్రబాబునాయుడు మాట్లాడే మాటలకు ఈ మధ్యకాలంలో మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.
వాస్తవానికి చంద్రబాబు నాయుడు అర్థం లేని వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు అని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడి విషయంలో చంద్రబాబు నాయుడు స్పీడ్ గా వ్యవహరించారు అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమం జరిగితే దానికి సంబంధించి అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు సాక్ష్యాలతో సహా ముందుకు వెళుతుంది. పోలీసులకు కూడా సాక్ష్యాలను పంపిస్తుంది. పోలీసుల పై విమర్శలు చేయడానికి సాక్ష్యాలను మీడియా ముందు చూపించి ఆరోపణలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు తిరుపతి లో తన పై రాళ్ళ దాడి జరిగినా… తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలు అయిన సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో స్పందించే తీరుపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా సరే ఈ దాడి చేసింది ఎవరు ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం చేయలేకపోయారు చంద్రబాబు నాయుడికి భారీ భద్రత ఉంటుంది. ఆ భారీ భద్రత నడుమ ఈ దాడి జరగడం వెనుక కారణం పై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి ఆ స్థాయిలో భద్రత ఉండే నాయకులకు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో ఏంటి అనే అంశాలను అక్కడున్న పోలీసులు అంతేకాకుండా కేంద్ర బలగాలు గమనిస్తూ ఉంటాయి. కానీ ఈ దాడి జరిగిన తీరుపై అనేక అనుమానాలున్నాయి. అసలు రాళ్ల దాడి చేస్తే మీడియా కెమెరాల్లో అయినా సరే కనపడాలి. మీడియా కెమెరాలకు కూడా కనపడలేదు. దీనితో అనుమానితులు ఎవరు అని ఫోటోలు కూడా విడుదల చేయలేదు. అంతమందిలో దాడి చేసి ఉంటే కచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకుని ఉండే వాళ్ళు. కానీ ఆ దాడి చేసింది ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సరే చాలామంది పట్టించుకోవడం లేదని అంటున్నారు.













