Minister Satya Prasad: ఓవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే.. మరోవైపు : మంత్రి అనగాని

జగన్ (Jagan) మాదిరి కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రజలకు నిజమైన సంక్షేమం అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satya Prasad,) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నారన్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ (GST) వసూళ్లు, వృద్ధి రేటులో ఏపీ మంచి ప్రగతి సాధించిందని తెలిపారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని వెల్లడిరచారు.