పవన్ కల్యాణ్ పై పోటీకి సిద్ధం
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ అన్నారు. మంత్రి రోజాతో కలిసి నగరిలోని కొంటగట్టు సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లో 175 స్థానాలు వైసీపీ గెలుచుకొంటుందని అన్నారు. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అని తెలిపారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు అందుతున్నాయని తెలిపారు.













