Rayapati: వారికి శిక్ష పడాల్సిందే : రాయపాటి శైలజ
అమరావతి మహిళలను కించపరిచిన వారికి శిక్ష పడాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ (Rayapati Sailaja) అన్నారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి మీడియా (sakshi Media) లో రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. అమరావతి (Amaravati)కి కులం, మతం ఆపాదించడం సరికాదన్నారు. ఇక్కడి ఆడవాళ్లు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు ఇవ్వడమే వాళ్లు చేసిన తప్పా? అని నిలదీశారు. వాక్ స్వాతంత్య్రం పేరుతో మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. అమరావతి రైతులు సాక్షి మీడియాను ఏమైనా అన్నారా? వాళ్లు మళ్లీ రోడెక్కే పరిస్థితిని సాక్షి మీడియా కల్పించింది. అమరావతి గురించి తప్పుగా మాట్లాడటం కొమ్మినేనికి కొత్తేం కాదు. గతంలోనూ అనేకసార్లు ఇలాగే చేశారు. మహిళలను కించపరిచిన కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) లో పశ్చాత్తాపం లేదు. ఇంతవరకు మహిళలకు క్షమాపణ కూడా చెప్పలేదు అని అన్నారు.













