వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మెట్టు గోవింద రెడ్డి
2004 లో టిడిపి ఎమ్మెల్యేగా రాయదుర్గం నుంచి గెలిచా. టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్న 30 మంది ఎమ్మెల్యేల్లో నేను ఒక్కని, ఆ తర్వాత కూడా పార్టీ ప్రతిపక్షంలో ఎమ్మెల్సీగా గెలిచి పార్టీకోసం పనిచేశా. 10 ఏళ్లు అధికారంలో లేకున్నా టిడిపిని కాపాడుకున్నాం. కానీ 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదు. కనీసం ఒక్కసారి కూడా సీఎం చంద్రబాబు ను కలిసే అవకాశం దక్కలేదు. మంత్రి కాల్వశ్రీనివాసులు ఇంఛార్జుగా ఉండి రాయదుర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. టిడిపి ప్రభుత్వం తీరుతో విసిగి వేశారి టిడిపిని వీడి వైసీపీలో చేరాం. వైఎస్ఆక్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్ సీఎం కావాలి. ఎలాంటి షరతులు లేకుండి పార్టీలో చేరా జగన్ మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చిన కష్టపడుతా.
కాపు రాంచంద్రా రెడ్డి
ఎలాంటి కండీషన్స్ లేకుండా జగన్ గారిని సీఎం చేయాలి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలనే వైసీపీలో మెట్టు గోవిందా రెడ్డి చేరారు. ఈసారి జగన్ కచ్చితంగా సీఎం అయి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని ప్రజలు భావిస్తున్నారని పార్టీలు, మతాలకు అతీతంగా జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు.













