కొడాలి నాని ని గుడివాడ నుంచి తరిమికొడతాం
గత 25 ఏళ్లుగా గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తుంటే ఇప్పుడు వైసీపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించారని టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. రంగా వర్ధంతి సందర్భంగా ఏజీకే స్కూలు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వెంకటేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మండిపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో తమ పార్టీ నేతలపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరింది కొడాలి నాని మనుషులేనని ఆరోపించారు. రంగా ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందిన వ్యక్తి కాదని, అందరివాడని కొనియాడారు. రౌడీయిజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా అని కొనియాడారు. కొడాలి నాని రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన్ను గుడివాడ నుంచి తరిమి కొడతామని తెలిపారు. పట్టణంలో రౌడీయిజాన్ని అంతం చేస్తామన్నారు.













