రవి మందలపుకు టిడిపి జోన్ 2 బాధ్యతలు
అమెరికాలో ఎన్నారై టీడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్న రవి మందలపుకు తెలుగు దేశం పార్టీ జోన్ 2 బాధ్యతలను అప్పగించింది. ఉభయ గోదావరి జిల్లాలను జోన్-2 గా పేర్కొంటున్నారు. ఈ జోన్-2 కు ‘రవి మందలపు’ను కో ఆర్డినేటర్ గా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు తదితర నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. 35 మంది ఎమ్మెల్యేలు ఈ జోన్ 2లో ఉంటారు. ‘తానా’ 23వ సమావేశాల సందర్భంగా జరిగిన ఎన్నారై టీడీపీ యూఎస్ఏ సమావేశంలో టీడీపీ నేత డాక్టర్ రవి వేమూరు ‘రవి మందలపు’ నియామకం గురించి ఎన్నారైలకు తెలియచేసారు. ఈ సందర్భంగా రవి మందలపు మాట్లాడుతూ, జోన్-2 కో ఆర్డినేటర్ గా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరియు జాతీయ కార్యదర్శి లోకేష్ తో కలసి పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా రవి మందలపు తెలిపారు.













