Ravi Vemuri:ప్రవాస తెలుగు వ్యవహారాల సలహాదారుగా వేమూరి రవి
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వేమూరి రవికుమార్ (Ravi Vemuri ) ను నియమిస్తూ జీఏడీ (GAD) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ (Suresh Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవాస తెలుగు ప్రజల సమస్యలను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేకాక ఆయా దేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగు ప్రజలకు ప్రభుత్వం (Government) నుంచి అందించాల్సిన సేవలపైనా వేమూరు రవి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారు. ఇక విదేశీ పారిశ్రామికవేత్తలు, ఆయా సంస్థల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టే వ్యవహారాలను కూడా రవి పర్యవేక్షిస్తారు.













