తిరుమలలో రథసప్తమి వేడుకలు
రథసప్తమి వేడుకలను తిరుమలలో ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు సూర్య ప్రభ వాహనం, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేన నిర్వహించనున్నారు. ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేనలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.













