శ్రీవారికి అరుదైన కానుక
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు అరుదైన కానుక సమర్పించాడు. అగ్గిపెట్టెలో ఉంచే పరిమాణంలో రూపొందించిన పట్టువ్రస్తంతో పాటు శాలువను ఓ చేనేత కార్మికుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సమర్పించారు. తెలంగాణ రాజన్న సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ రెండు అగ్గిపెట్టెల్లో పట్టువస్త్రంతో పాటు శాలువను వేర్వేరుగా ఉంచి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012లో ప్రపంచ తెలుగు మహాసభల్లో అగ్గిపెట్టెలో చీరను తీసుకువచ్చి ఆవిష్కరించి పురస్కారాన్ని అందుకున్నానని, ఈ సందర్భంగా పట్టువస్త్రాలు బాహూకరిస్తానని శ్రీవారికి మొక్కుకున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు శ్రమించి పట్టువస్త్రం, శాలువను రూపొందించినట్లు వివరించారు.













