Amaravathi: ఏపీ ప్రభుత్వంలో ర్యాంకుల రచ్చ… చంద్రబాబు సుదీర్ఘ వివరణ
పరిపాలనలో వేగం పెంచాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు థ్యేయంగా కనిపిస్తోంది. పాలనను పరుగులెత్తించాలి.. రాష్ట్రంలో అభివృద్ధి స్పీడు పెంచాలని స్వయంగా పలుసందర్భాల్లో చంద్రబాబు చెప్పారు. అంతేకాదు.. పాలనలో ఏ మంత్రి ఎక్కడున్నారన్నది స్వయంగా వెల్లడించారు. ఇందులో కేవలం ఫైళ్ల క్లియరెన్స్ లో చంద్రబాబు ఆరో స్థానం, లోకేష్(lokesh) ఎనిమిది, పవన్ కల్యాణ్(pawan kalyan) పదో స్థానంలో ఉన్నట్లు తేల్చారు. ఎప్పట్లానే ఆయన ఈ దఫా కూడా రేటింగ్స్, ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశంపై ర్యాంకులు వెల్లడించిన సంగతి తెలిసింది.
అయితే తమ నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పదోస్థానం రావడంపై .. జనసేన (janasena)కార్యకర్తలుగుర్రుగా ఉన్నారు. ఈమధ్య లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్స్ బలంగా వినిపించిన నేపథ్యంలో, జాబితాలో అతడికి పవన్ కంటే మెరుగైన ర్యాంక్ రావడంపై జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
లెక్కప్రకారం, అది సరైన ర్యాంకింగ్ జాబితానే కావొచ్చు. ఎందుకంటే, పవన్ వద్ద చాలా మంత్రిత్వ శాఖలున్నాయి. కాబట్టి ఫైళ్ల క్లియరెన్స్ నెమ్మెదిగానే సాగుతుంది. అయినప్పటికీ ఈ ర్యాంకులు మంత్రుల మధ్య, పార్టీల మధ్య అభిప్రాయబేధాలకు దారితీసిందనే సంకేతాలు బయటకొచ్చాయి.. మరీ ముఖ్యంగా జనసేన-టీడీపీ మధ్య విభజన ఏర్పడే ప్రమాదం తలెత్తిందంటూ కథనాలు-విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. దీంతో దాన్ని కవర్ చేసేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు.
ఎవ్వరూ ఎక్కువ కాదు, అలా అని ఎవ్వరూ తక్కువ కాదంటూ సుదీర్ఘంగా తనకుతాను వివరణ ఇచ్చుకున్నారు చంద్రబాబు. నేరుగా పవన్ కల్యాణ్ పేరును ఆయన ప్రస్తావించనప్పటికీ.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే తప్ప, ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదంటూ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. “గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి… సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలంమన్నారు.













