Ahmedabad: హుటాహుటిన అహ్మదాబాద్ బయల్దేరిన రామ్మోహన్నాయుడు
అహ్మదాబాద్ (Ahmedabad)లో ఎయిరిండియా విమానం కూలిన నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అక్కడికి బయల్దేరారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన విజయవాడ (Vijayawada )నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై డీజీసీఏ, ఎయిరిండియా (Air India), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలతో కేంద్రమంత్రి సంప్రదింపులు జరిపారు. అహ్మదాబాద్ దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రమాదం వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయ బృందాలు ఇప్పటికే ఘటనాస్థలిలో ఉన్నట్లు తెలిపారు.













