ఏనీ సెంటర్.. డిస్కషన్ కు రెడీ.. పవన్ కు సవాల్ విసిరిన రాంగోపాల్ వర్మ..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు రాంగోపాల్ వర్మ కు అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. వైయస్ జగన్ ని పొగడ్డం.. చంద్రబాబును, పవన్ను తిట్టడం వర్మకు అనాదిగా అలవాటు. ఎలక్షన్స్ హీట్ ను పెంచడానికి అతను వ్యూహం, శపథం అని సినిమాలను కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈరోజు ఈ చిత్రాలకు సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ ప్రభుత్వం పై రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల అస్త్రాలు సంధించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ఎంతో పాటు పడ్డారన్న రాంగోపాల్ వర్మ. ఏ రకంగా రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించాడు పవన్ చెప్పాలి అంటూ ఈ నేపథ్యంలో ఆయన డిమాండ్ కూడా చేశారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి ఎక్కడైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాలు కూడా విసిరారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జగన్ కు మేలు చేయడానికి రాంగోపాల్ వర్మ ఈ సినిమాలు తీశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రాంగోపాల్ వర్మ మాత్రం తన అభిప్రాయాన్ని సినిమాల రూపంలో తీశాను అని.. జగన్ ఏమిటో ఈ మూవీలో మీరు తెలుసుకుంటారు అని అంటున్నారు.













