తెలుగుదేశం పార్టీకి భారీ షాక్
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. కార్యకర్తల సహకారం మరిచిపోలేనిదన్న తోట త్రిమూర్తులు గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను ప్రజల మనసును గెలుచుకున్నానని అన్నారు. ఏ పార్టీలో చేరుతున్నది అధికారికంగా చెప్పకపోయినా వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.













