ఏపీ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి రాజీనామా
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ పాలసీ)గా ఉన్న కె.రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంకు రాజీనామా పత్రాన్ని ఆయన సమర్పించారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు రామచంద్రమూర్తి వెల్లడించారు. గతేడాది నవంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించింది. సచివాలయంలోని ఐదో బ్లాక్లో ఆయనకు ఛాంబర్ కేటాయించారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు, అధ్యయనం చేసేందుకు నియమించినప్పటికీ ఆయనకు ఇప్పటి వరకు ఒక్క దస్త్రం కూడా రాకపోవడంతోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.













