వర్మ.. వర్మ.. మధ్యలో పవన్.. పిఠాపురంలో హైడ్రామా..
ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అలా పవన్ కళ్యాణ్ పిఠాపురం సంగతి ఎత్తారో లేదో ఇలా ఆర్జీవి ఆన్లైన్ లో ఎంట్రీ ఇచ్చాడు. రాంగోపాల్ వర్మ ఎంటర్ అవ్వడంతో.. అతను ఇచ్చిన సర్ప్రైజ్ ట్వీట్ కారణంగా ఆన్లైన్ వేదికగా పెద్ద చర్చ నడుస్తుంది. రానున్న ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని పవన్ ప్రకటించిన వెంటనే.. ఆకస్మిక నిర్ణయం.. నేను పిఠాపురం నుంచి పోటీ కి రెడీ అని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాదు డౌట్ పడే వారందరికీ చెబుతున్న ..నేను సీరియస్ గానే చేస్తున్న.. మరో ట్వీట్ ని కూడా చేశారు. ఇప్పుడు ఇద్దరు వర్మల మధ్య పవన్ కళ్యాణ్ @ పిఠాపురం అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించడంతో అక్కడ స్థానిక టిడిపి కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ తో పాటు చంద్రబాబు లోకేష్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టిడిపి ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్న ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. రాంగోపాల్ వర్మ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించారు తప్ప పార్టీ పరంగానా లేక ఇండిపెండెంట్ గానా అన్న విషయం పై స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క ఇది కేవలం వెటకారపు ప్రకటన అని.. ఓడిపోయే దానికి ఎక్కడ పోటీ చేస్తే ఏమిటి.. ఎప్పుడు అనౌన్స్ చేస్తే ఏమిటి.. అన్న సెటైరికల్ వెర్షన్ లో రామ్ గోపాల్ వర్మ ఇలా పోస్ట్ చేశారు అని నెటిజెన్లు భావిస్తున్నారు.













