Rajnath Singh : ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : రాజ్‌నాథ్‌సింగ్
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh ) అన్నారు. కొత్తగా తయారు చేసిన యుద్ధ నౌకలు ఉదయగిరి (Udayagiri) (ఎఫ్35), హిమగిరి(Himagiri) (ఎఫ్34) లను విశాఖపట్నం (Visakhapatnam ) లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాధ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ నౌకలను డిజైన్, స్టెల్త్, ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థల్లో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేశారు. దేశంలోని వేర్వేరు షిప్‌యార్డులలో నిర్మించిన రెండు ఫ్రంట్‌లైన్ సర్ఫేస్ యుద్ధ నౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే ప్రథమం. బ్లూ వాటర్ (Blue Water) పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను నిర్వర్తించే సామర్థం ఈ నౌకల సొంతం. ఈ రెండు నౌకలు (two ships) బహుళ పాత్రలు పోషించనున్నాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీక. ఆత్మనిర్భర్ భారత్‌కి ఇవి నిదర్శనం. సాంకేతిక పరిజ్ఞానం ఈనౌకల తయారీలో ప్రతిబింబిస్తోంది. 2050 నాటికి 200 యుద్ధనౌకలు నిర్మాణం చేస్తాం అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.







