టీడీపీ నుంచి మేడా సస్పెన్షన్
కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజంపేట నియోజకవర్గ నేతల సమావేశంలో ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన మేడా కుటుంబ గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ నుంచి మల్లికార్జునరెడ్డి ఒక్కరే గెలిచారు. దీంతో అసెంబ్లీ విప్ పదవి కూడా ఇచ్చారు. అనంతరం ఆయన తండ్రిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారు. మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశించారు. కానీ రాలేదు. దాంతో వైసీసీ లోకి వెళ్లి అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రెండూ తీసుకోవాలని కొంతకాలంగా మల్లికార్జున రెడ్డిపై ఆయన సోదరుడు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చర్చలకు టీడీపీ యత్నించి ఆయన నుంచి స్పందన రాలేదు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాత్కాలికంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి అప్పగించారు.













