పోసాని కృష్ణ మురళికి షాక్
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలతో నటుడు, దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు అయ్యింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేవారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.













