Raj KC Reddy: ఆ రూ.11 కోట్లతో నాకు సంబంధం లేదు .. రాజ్ కెసిరెడ్డి
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డి (Raj KC Reddy) కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని కాచారం (Kacharam ) లో సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని తెలిపారు. ఫాంహౌస్ యజమాని విజయేందర్ రెడ్డి (Vijayender Reddy )కి పలు వ్యాపారాలున్నాయన్నారు. ఆయనకు ఇంజినీరింగ్ కాలేజీ (Engineering College) , ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయని, ఆయా కంపెనీలకు రూ.వందల కోట్ల టర్నోవర్ ఉందని రాజ్ కెసిరెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు.







