Supreme Court: రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
వైసీపీ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి (Raj KesiReddy) కి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ఆయన బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.ఈ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కెసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కెసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు ప్రారంభించగానే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ కెసిరెడ్డి ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. హైకోర్టు అన్నీ పరిశీలించాకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని అభిప్రాయపడింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













