Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం (Liquor scandal ) లో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) విచారణ పూర్తయింది. అనంతరం అతడిని పోలీసులు సిట్ కార్యాలయం (SIT office) నుంచి విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం స్కామ్‌కు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించి, కీలక ఆధారాలు సేకరించారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కూడా సిట్ అధికారులు సిద్ధం చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) లో హాజరుపరిచారు.













