పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరా రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్.రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ బలహీనానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన వైదొలిగారు. గత నెల 11న పోలింగ్ జరిగిన వెంటనే ప్రజానాడిని గుర్తించిన రఘువీరా.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపారు. దీనిపై అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవిని త్వజిస్తానని రాహుల్ పట్టుబడుతున్నారు. ఆయన రాజీనామాను పార్టీ ఆమోదిస్తే జాతీయ స్థాయిలో పీసీసీ అధ్యక్షులందరూ మాజీలవుతారు.













