రాముడిగా మంచి పేరు తెచ్చుకుంటారో.. రావణుడిగా చెడ్డపేరు తెచ్చుకుంటారో
రాముడిగా మంచి పేరు తెచ్చుకుంటారో, రావణుడిగా చెడ్డపేరు తెచ్చుకుంటారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పుట్టిన రోజు నాడు సీఎం జగన్ ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు డబ్బులు కట్టినవారికి తిరిగి ఇచ్చేయాలన్నారు. పుట్టిన రోజు ఒక సార్థకత తెచ్చుకోవాలన్నారు. మీరొక సీతయ్య మీరు ఎవరి మాట వినరు. వినరని తెలిసినా ఇంకా పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా చెబుతున్నానని అన్నారు.













