ఒకప్పటి బిహార్ ఘటనలు.. ఇప్పుడు ఏపీలో
ఒకప్పటి బిహార్ ఘటనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతిని సహించనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనడం హాస్యాస్పందంగా ఉందని అన్నారు. సీఎం ఇలా మాటిమాటికీ అవినీతి అంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవితీనికి మొదటి పాయింట్ రాజకీయ నేతలే అన్నారు. అవినీతి నిర్మూలన కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ముందు మీపై ఉన్న కేసులు ఫైనల్ చేయించుకోండి. మీ కేసులు త్వరగా పూర్తి చేయాలని కోరితే నా కాళ్లు హూనం చేశారు. అధికారం కోసం ముద్దులు పెడుతూ జనంలో తిరిగిన జగన్ ఇప్పుడు తిరగాలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.













