ఏపీ ప్రభుత్వానికి ముందు చూపు కన్నా.. మందు చూపే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు కన్నా మందు చూపే ఎక్కువైందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పుల కోసమే ఢిల్లీ లో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిష్టవేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రుణదాహం ఎప్పటికి తీరుతుందోనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు మొదలయ్యాయని అన్నారు. కృష్ణపట్నంలో లోకల్ కోల్‌ను వాడుకోవచ్చు కదా అని సూచించారు. ప్రభుత్వానికి అప్పులపైనే ఆలోచన తప్ప ఒక విజన్ అంటూ ఏమీ లేదని విమర్శించారు.













