వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోను.. కోర్టుకు సమాధానం ఇస్తా
కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై రఘురామ స్పందించారు. రేపో, మాపో జైలు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఈ ఛార్జిషీట్ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామమని అన్నారు. అన్ని అంశాలపై కోర్టు సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో రఘురామకృష్ణరాజుతోపాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, ఛార్టెడ్ అకౌంటెంట్లతో కలిపి 16 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.













