వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దీక్ష
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తన నివాసంలో దీక్ష చేపట్టారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, అమరావతి ఐకాస కన్వీనర్ జీవీఆర్ శాస్త్రి.. రఘురామకృష్ణరాజు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాఘరామకృష్ణరాజు మాట్లాడుతూ ఏడాదిలో దాదాపు 15 ఆలయాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక కుట్రను ఛేధించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హిందూ దేవాలయాలపై అనేక ఘటనలు జరిగాయని ఎంపీ కనకమేడల అన్నారు. అవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవేనని ఆరోపించారు. ఈ ఘటనలన్నింటిని సీబీఐ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేదంటే ఇవన్నీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మాదిరిగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.













