అదే జరిగితే అది ఎన్నికల నియమావళిని …ఉల్లంఘించినట్లే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎంపీ రఘురామ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో రెండు హెలికాప్టర్లను పెట్టాలని ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఆ హెలికాప్టర్లను ఎన్నికల వేళ సీఎం జగన్ వినియోగించనున్నారనే వార్తల నేపథ్యంలో రఘురామ ఈసీకి ఫిర్యాదు చేశారు. అదే జరిగితే అది ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినట్లే అవుతుందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికే ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రఘురామ ఈసీనీ కోరారు.













